అమ్మా నువ్వు లేని జీవితం ఏమీ బాలేదు
on Dec 3, 2024
బిగ్ బాస్ సీజన్ 5లో శ్వేతా వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఐతే ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. '2017 డిసెంబర్ 2 తెల్లవారుజామున 2:35 గంటలకు నన్ను వదిలేసి మా అమ్మ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయింది' అంటూ ఆమె తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. 'నీ తోడు, నీ నీడ నాకు దేవుడు ఇచ్చిన బహుమతి. నీలాంటి వాళ్లు ఎప్పటికీ నాకు దొరకరు. నేను, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేకుండా జీవితం ఏం బాలేదు' అని భావోద్వేగానికి లోనైంది శ్వేతా వర్మ. అని మరో పోస్ట్ పెట్టింది శ్వేత. దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్వేతా వర్మకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
బిగ్ బాస్ తర్వాత టీవీ షోస్ లో చేస్తూ వస్తోంది శ్వేతా వర్మ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన కెరీర్ గురించి అనేక విషయాలను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది. పచ్చీస్, సైకిల్ మూవీల్లో నటించింది. అలాగే శ్వేతా వర్మ ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. కాస్టింగ్ కౌచ్ మీద కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి వైరల్ అయ్యింది. టాలెంట్ ని తప్ప కమిట్మెంట్ మీద ఆధారపడలేదు అంటూ గతంలో ఒక డైరెక్టర్ కి గట్టిగానే ఇచ్చింది శ్వేతా వర్మ. శ్వేతా వర్మ రీసెంట్గా హెబ్బా పటేల్ నటించిన సందేహం అనే మూవీలో ముఖ్య పాత్రను పోషించింది.